Sunday, September 6, 2009

ఔను ఎంత కష్టం.......

నీ కోసం వేల వేల క్షణాలని వృథాగా పారబోసుకున్నాను. ఆనందాన్ని,బాధలని,కోపాలని,తాపాలని నీతో కలసి పంచుకున్నాను. "నేను" లో 'నే'నేనైతే'ను ' నువ్వు.విందులు,వినోదాలు,చిలిపి ఆటలు, వలపు పాటలు విటన్నిటిని చూసి ప్రేమెంత సరళమైందో అనుకునేవాణ్ణి. మరి ఇదేంటి? ఈ రోజు దూరమైన నువ్వు కనబడితె మనసు బంధిస్తున్న ఆగని కనుచూపు, నీ ముంగురుల చాటున దాగిన జుంకాని చుడాలన్న ఉబలాటం ఔరా ...! ప్రేమున్నా లేనట్టు కనబడటం ఎంత కష్టం.

Sunday, May 3, 2009

స్త్రీ

స్త్రీ అంటే ప్రకృతి అని ఎవ్వరన్నరో నాకు తెలియదు కాని,
అప్పుడే నీరామనిలా నా దగ్గర ఎడ్చిన నువ్వు అతడి దగ్గర హేమంతంలా చల్లగా నవ్వితే తెలిసింది.

Sunday, April 12, 2009

తెలుగు హైకు

ఘనీభవించిందో,గల్లంతయ్యిందో కాలం మన ఇద్దరి పెదవుల మధ్య................

Monday, March 9, 2009

తెలుగు హైకు

సంధించిన అస్త్రంల నీ చూపు గుండెనే గమ్యన్ని చేసి ఎప్పుడో నేను ......................

Friday, February 27, 2009

మనసు మాట్లాడితే .....

-గాలి నీకు చెప్పేసుంటుంది పూలు నీతో కలిసి నవ్వేసుంటయి నువ్వంటే నాకిష్టం అన్న మాట విని నువ్వేంటి విషయం అని గట్టిగా అడిగితే ఎవ్వరూ లేరే నా పక్కన తోడుగా..........

Monday, February 2, 2009

తెలుగు హైకు

-గాలి కి లాంతరు గుప్పుమంది నీ జ్ఞాపకం తట్టిన నా హ్రుదయం లాగ........
-ఓ ప్రణయ దివ్వె నా జీవితాన వెలుగే కాదు వేడి వేదన కూడా

Wednesday, January 7, 2009

తెలుగు హైకు

-నువ్వు లేని వెన్నెల రాత్రి నాకు అమావాస్య
-రాత్రంత నీ చూపుల వర్షం లో తడిసి నా మనసుకి ఉదయాన్నే ప్రేమ జలుబు